గుజరాత్‌ను గడగడలాడిస్తున్న నిసర్గా తుఫాన్: 43,000 మంది సురక్షిత ప్రాంతాలకు-video

బుధవారం, 3 జూన్ 2020 (13:31 IST)
తీవ్రమైన పెను తుఫాను నిసర్గా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అలీభాగ్‌కు దక్షిణంగా తీరం దాటుతుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ ప్రభావంతో గుజరాత్ వల్సాద్ మరియు నవసరి జిల్లాల్లోని తీరప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న దాదాపు 43,000 మంది ప్రజలను ఇప్పటివరకు సురక్షితమైన ప్రదేశాలకు తరలించారు.
 
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 13 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం  ఆరు బృందాలను వివిధ ప్రదేశాలలో మోహరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన మరో ఐదు బృందాలను కూడా పిలిచినట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఇప్పటికే ఈ తుఫాన్ తీవ్రత గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు