గత కొంతకాలంగా లైఫ్ సపోర్ట్ మిషన్లపై ఆధారపడుతూ ఊపిరిపీల్చుతూ వచ్చిన ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసె, జ్ఞానపీఠ బహుమతి గ్రహీత మహాశ్వేతాదేవి గురువారం కోల్‌కతాలో కన్నుమూశారు. ఆమె వయసు 90 యేళ్లు.
గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ వచ్చిన ఆమెను కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ కృత్రిమ శ్వాసను అందిస్తూ చికిత్స చేస్తూ వచ్చారు. అయితే, ఆరోగ్యం పరంగా ఇతర సమస్యలు కూడా తలెత్తడంతో గత రెండు నెలలుగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ పరిస్థితుల్లో గురువారం కన్నుమూశారు.