రావణుడి అహంకారం.. కంసుడి గర్జనలు ఏమీ చేయలేకపోయాయి : సీఎం యోగి

శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (11:20 IST)
తమిళనాడు రాష్ట్రానికి చెందిన డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. హిందూ సంస్థలతో పాటు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా స్పందించారు. రావణుడి అహంకారం, కంసుడి గర్జనలు కూడా ఏమీ చేయలేపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. 
 
సనాతన ధర్మంపై గతంలో దాడులు చేసిన వారు దానికి నష్టం కలిగించడంలో విఫలమయ్యారని చెప్పారు. ఇపుడు అధికార దాహంతో ఉన్న పరాన్నాజీవులు కొందరి వల్ల కూడా దానికి ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన అన్నారు. సనానత ధర్మాన్ని తుడిచి పెట్టేయాలన్న రావణుడి అహంకారం కూడా విఫలమైందన్నారు. కంసుడి గర్జనలు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయాయని గుర్తుచేశారు. 
 
బాబర్, ఔరంగజేబు వంటివారి దురాగతాలు కూడా నిర్మూలించలేక పోయాయని చెప్పారు. అలాంటి సనాతన ధర్మాన్ని చిల్లర శక్తులు తుడిచి పెట్టేస్తాయా? అని ఆయన ప్రశ్నించారు. సనాతన ధర్మం అనేది సూర్యుడి శక్తివంటిదని అభివర్ణించారు. మూర్ఖులు మాత్రమే సూర్యుడిపై ఉమ్మ వేయాలని చూస్తారని, అయితే, అది తిరిగ వారిపైనే పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహింంచాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు