బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో విశాఖకు 380 కిలోమీటర్లు, పారాదీప్ 480కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.
మత్సకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని విశాఖ తుఫాన్ హెచ్చిరికల కేంద్రం సూచించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చిరిక జారీ చేసింది. కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.