మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించారన్న చేశారన్న రాజ్‌నాథ్ - సమర్థించిన ఫరూక్ అబ్దుల్లా

మంగళవారం, 14 డిశెంబరు 2021 (12:40 IST)
దేశ విభజనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సమర్థించారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న 'స్వర్ణిమ్ విజయ్ పర్వ్' ప్రారంభకార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశ విభజనపై వ్యాఖ్యానించారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడాన్ని చారిత్రక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. 
 
ఇది 1971లో భారత్, పాకిస్థాన్ యుద్ధానికి దారితీసిందనిచెప్పారు. ఇపుడు భారత్‌ను ముక్కలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఒక అజెండాగా పెట్టుకుని ప్రోత్సహిస్తుందని రాజ్‌నాథ్ అన్నారు. ఈ వ్యాఖ్యాలను మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సమర్థించారు. 
 
దేశ విభజన అంటూ జరగకుండా ఉండివుంటే హిందూ, ముస్లిం వర్గాలు రెండూ శాంతియుతంగా ఉండేవని, ఫలితంగా దేశం మరిత శక్తిమంతంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడం ఖచ్చితంగా చారిత్రక తప్పిదమేనని చెప్పారు. 
 
ముఖ్యంగా, దేశ విభజన సమయంలో ముస్లిం జనాభా కేవలం 26 శాతంగా ఉంటే, రిజర్వేషన్ ఇవ్వాల్సిన చోట 39 శాతం ఇవ్వాలని పాకిస్థాన్ నేత జిన్నా పట్టుబట్టారని గుర్తు చేశారు. అందుకు కాంగ్రెస్ నిరాకరించడంతో జిన్నా దేశాన్ని విభజన కోసం పట్టుబట్టారన్నారు. నాడు అలా జరగకపోయివుటే ఇపుడు మనమంతా (భారత్, పాకిస్థాన్) ఐక్యంగా కలిసివుండేవారిమని ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు