13ఏళ్ల కుమార్తెను గర్భవతిని చేశాడు... ఎక్కడంటే?

మంగళవారం, 24 నవంబరు 2020 (12:15 IST)
వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా 13 ఏళ్ల కుమార్తెను గర్భవతిని చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ ఘటన తమిళనాడు, విల్లుపురం జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అలాగే 13 ఏళ్ల కుమార్తెను గర్భవతిని చేసిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక 9వ తరగతి చదువుతుంది. 
 
ఇటీవల అస్వస్థతకు గురైన బాలికను తల్లి విల్లుపురం వైద్యకళాశాలకు తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి బాలిక నాలుగు నెలల గర్భవతిగా నిర్ధారించారు.. ఈ విషయమై బాలిక తల్లి విల్లుపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను విచారించగా, తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. దీంతో పోక్సో చట్టంపై కేసు నమోదుచేసిన పోలీసులు, కామాంధుడైన బాలిక తండ్రిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు