హైకోర్టులు కూడా కట్.. కాపీ.. పేస్ట్‌లు చేస్తే ఎలా? సుప్రీంకోర్టు కామెంట్స్

శనివారం, 6 మార్చి 2021 (10:44 IST)
కింది కోర్డుల నుంచి హైకోర్టులు ఇస్తున్న ఆర్డర్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాయి. గతంలో ఇచ్చిన తీర్పులనే కట్.. పేస్ట్.. కాపీ చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. కింది కోర్టులు ఇస్తున్న ఆర్డర్లను యధాతథంగా అనుకరిస్తున్నారు. ఈ పద్ధతి మారాలి అని సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇటీవల ఓ కేసులో ఒడిసా హైకోర్టు ఇచ్చిన ఆర్డరుపై ...  యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
బిభు ప్రసాద్‌ సారంగి అనే ఒడిసా రాష్ట్ర సర్వీసుల ఉద్యోగి ఒకరు.. సీనియారిటీ ప్రకారం తనకు ఐఏఎస్‌ హోదా కల్పించడం లేదంటూ యూపీఎస్సీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీఓపీటీ)పై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. క్యాట్‌లో సారంగికి అనుకూలంగా తీర్పు వచ్చింది. 
 
దీంతో యూపీఎస్సీ అప్పీల్‌కు వెళ్తే హైకోర్టు కూడా క్యాట్‌ తీర్పును సమర్థించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘‘క్యాట్‌ తీర్పును అచ్చు గుద్దినట్లు హైకోర్టు తీర్పులో దించేశారు. చాలా హైకోర్టులు ఇదే చేస్తున్నాయి. ఇది సరికాదు. సొంతంగా మెదడును ఉపయోగించాలి. ఆర్డర్లలో విశ్లేషణ ఉండాలి’’ అని సుప్రీం వ్యాఖ్యానించిది. ఒడిసా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు