యూపీలో నాంది: చెయ్యని తప్పుకు 20 ఏళ్లు జైలు శిక్ష

శనివారం, 6 మార్చి 2021 (08:49 IST)
UP Man
అల్లరి నరేష్ నాంది సినిమాలో చేయని నేరానికి శిక్ష అనుభవించిన ఓ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించారు. ప్రస్తుతం ఇదే తరహా ఘటన రియల్‌లో చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లో చేయని తప్పుకు ఓ వ్యక్తి గత 20 ఏళ్లుగా జైలు శిక్షను అనుభవించాడు. లలిత్ పూర్‌కు చెందిన 23 ఏళ్ల విష్ణు తివారి అత్యాచారం కేసులో 2000 సెప్టెంబర్ 1 వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తరువాత జైల్లో ఉన్నాడు. 
 
దాదాపుగా ఈ కేసు 20 ఏళ్ళు నడిచింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని విష్ణు తివారి ఎవరూ నమ్మలేదట. 20 ఏళ్లపాటు సుదీర్ఘమైన పోరాటం చేయడంతో నిరపరాధిగా బయటపడ్డాడు. గతనెల 28 వ తేదీన హైకోర్టు డివిజన్ బెంచ్ విష్ణు తివారీని నిరపరాధిగా పేర్కొంటూ విడుదల చేసింది. 
 
23 సంవత్సరాల వయసులో జైలుకు వెళ్లిన విష్ణు తివారి, 43 ఏళ్ల వయసులో విడుదలయ్యాడు. ఎలాంటి తప్పు చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా ఎవరూ వినలేదని, 20 ఏళ్ళు జైల్లో ఉండటం వలన తన కుటుంబాన్ని కోల్పోయానని, తనకు సోదరుడు మినహా ఎవరూ లేరని ఆవేదన వ్యక్తం చేశాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు