మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

ఐవీఆర్

సోమవారం, 5 మే 2025 (13:35 IST)
జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మహాకాళేశ్వర ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవించింది. శంఖద్వార్ సమీపంలోని కార్యాలయం బ్యాటరీలు పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాలా దూరం నుండి నల్లటి పొగ మేఘం కనిపించింది. భారీ అగ్ని ప్రమాదం కారణంగా మహాకాల్ ఆలయంలో గందరగోళం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయ, రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి.
 
అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. బ్యాటరీలలో షార్ట్ సర్క్యూట్ జరిగడం వల్లనే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలింది.

మండుతున్న ఎండలు, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం #fire #heatwave #Mahakaleswar pic.twitter.com/BTh1YwJNjI

— Webdunia Telugu (@WebduniaTelugu) May 5, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు