జమ్మూకాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ - ఐదుగురు ఉగ్రవాదుల హతం
శుక్రవారం, 16 జూన్ 2023 (11:22 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు ఉగ్రవాదాలు హతమయ్యారు. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో వీరు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని ఇండో పాక్ సరిహద్దు నియంత్రణ రేఖకు ఆనుకుని కుప్వారా జిల్లా సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
దీంతో పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నియంత్రణ రేఖ సమీపంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. కృష్ణా ఘాటి సెక్టార్‌లో గాలింపు చర్యల్లో ఈ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పాకిస్థాన్‌లో తయారైన స్టీల్ కోర్ కాట్రిడ్జ్‌లు, మందులు, ఇతర సామాగ్రి ఉన్నాయి.
కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం మేరకు ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టుగా ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఈ రెండు బ్యాగుల్లో ఒక ఏకే47, తొమ్మిది మ్యాగజైన్లు, 438 కాట్రిడ్జ్‌లు రెండు లభించాయని, నాలుగు మ్యాగజైన్‌లతో కూడిన మ్యాగజైన్‌లు లభించాయని, ఒక పిస్టల్, ఆరు గ్రైనైడ్‌లుకాకుండా కొన్ని దుస్తులు, మందులు కూడా లభ్యమైనట్టు తెలిపారు.
ఒకే తూటాకు దంపతుల మృతి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒకే తూటాకు దంపతులు మృత్యువాతపడ్డారు. భార్య ఫోను పోగొట్టడంతో భర్త తరచూ గొడవపడుతూ వచ్చాడు. ఇదే విషయంపై మంగళవారం కూడా మరోమారు ఆ దంపతులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో భార్యను హగ్ చేసుకున్న భర్త.. నాటు తుపాకీతో భార్య వెన్ను భాగంలో కాల్చాడు. ఈ తుపాకీ బుల్లెట్ భార్య శరీరం నుంచి భర్త శరీరంలోకి కూడా దూసుకొచ్చింది. దీంతో ఒకే తూటాగా భార్యాభర్తలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. భర్త క్షణికావేశంలో చేసిన పనికి వారి పిల్లలు అనాథలయ్యారు. ఈ పిల్లలను పోలీసులు అనాథాశ్రమానికి తరలించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లా ఖాన్ పూర్ గ్రామానికి చెందిన అనేక్ పాల్ అనే వ్యక్తి రోజూ కూలీ పనులు చేసుకుని జీవించేవాడు. ఈయనకు భార్య సుమన్, నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం భార్య ఫోన్ పోగొట్టుకోవడంతో దంపతుల మధ్య వివాదం మొదలైంది. ఇటీవలికాలంలో పలుమార్లు వారిద్దరూ గొడవపడ్డారు. మంగళవారం కూడా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన అనేక్ పాల్.. భార్యను గట్టిగా కౌగలించుకుని ఆమె వీపుపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో బుల్లెట్ ఆమె ఛాతిలో నుంచి అనేక్ పాల్ శరీరంలోకి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల శబ్దం విని లోపలికొచ్చిన ఇరుగుపొరుగువారు అనేక్ పాల్ దంపతులను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, వారు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనాథలైన వారి పిల్లలను సంరక్షణాలయానికి తరలించారు.