నీటమునిగిన భీమశంకర జ్యోతిర్లింగం

శుక్రవారం, 23 జులై 2021 (12:45 IST)
shiva
మహరాష్ట్రలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు కారణంగా వరద ముంచెత్తుతుంది. పూణె జిల్లాలోని ఖేడ్‌లో గల ప్రసిద్ధ భీమశంకర క్షేత్రంలోకి వరద నీరు ప్రవేశించింది. చరిత్రలోనే తొలిసారి ఆలయంలోని శివలింగం వరద నీటికారణంగా నీటమునిగిపోయింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకర జ్యోతిర్లింగం కూడా ఒకటి. ప్రస్తుతం ఆలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
 
భీమశంకర ఆలయం సమీపం నుండి కృష్ణానది యొక్క ఉపనదుల్లో ఒకటైన భీమానది ఇక్కడే పుట్టింది. డాకిని కొండ పైభాగంలో భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది. సమీపంలోని పర్వాతాల నుండి వర్షాల కారణంగా వరద పోటెత్తుతుంది. ఈక్రమంలోనే ఆలయంలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. గతంలో ఏన్నడూ ఆలయంలోకి వరద నీరు వచ్చిన సందర్భంలేదని భక్తులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు