దేశాన్ని వణికిస్తోన్న కరోనా.. త్వరలో అక్కడ థర్డ్‌వేవ్..

మంగళవారం, 1 జూన్ 2021 (10:38 IST)
ఉత్తరాదిన థర్డ్ వేవ్ జనాలను వణికిస్తోంది. ఏప్రిల్‌లో దేశ‌రాజధాని ఢిల్లీని వణికించి కరోనా మహమ్మారి.. ప్రస్తుతం అదుపులోకి వచ్చింది. లాక్‌డౌన్ విధించడంతో కేసులు తగ్గి క్రమంగా నగరం కోలుకుంటోంది. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడుతున్నట్టు కనిపించినా.. మరోసారి ముప్పు తప్పేలా లేదు.

ఐఐటీ ఢిల్లీ నివేదిక. మూడో దశ వ్యాప్తిపై ఐఐటి ఢిల్లీ నివేదిక భ‌యాందోళ‌న‌లకు గురిచేస్తోంది. మూడో దశలో ఢిల్లీలో సగటున రోజుకు 45 వేల‌కుపైగా కేసులు న‌మోద‌వుతాయ‌ని నివేదిక అంచనా వేసింది. అలాగే రోజూ దాదాపు తొమ్మిది వేల‌ మంది ఆసుపత్రిలో చేరే అవ‌కాశాలున్నాయని పేర్కొంది.
 
రాబోయే విపత్కర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉండాల‌ని నివేదిక హెచ్చరించింది. ఢిల్లీలో అటువంటి పరిస్థితి ఎదురయితే నగరానికి ప్రతిరోజూ 944 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుంద‌ని అంచ‌నా. 
 
ఈ సూచ‌న‌ల నేప‌థ్యంలో ఢిల్లీలో థ‌ర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్ప‌టికే కేజ్రీవాల్ సర్కారు స‌న్నాహాలు ప్రారంభించింది. ఆక్సిజన్ కొరతను అధిగమించేలా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆక్సిజన్ సరఫరా, నిర్వహణపై ఐఐటి ఢిల్లీ... కేజ్రీవాల్ స‌ర్కారు కలిసి పనిచేస్తున్నాయి.
 
ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల వ్యూహాత్మక సమస్యలను విశ్లేషించడం ద్వారా రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఆక్సిజన్ పంపిణీపై ఐఐటి ఢిల్లీ బ్లూప్రింట్‌‌ను ఎప్పుడు అమలు చేస్తారో వివరించాలని గ‌తంలో హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు కేజ్రీవాల్ ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. అలాగే మహారాష్ట్రలోనూ కరోనా థర్డ్ వేవ్ తప్పేలా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అక్కడ 8వేల చిన్నారులను ఇప్పటికే కరోనా సోకింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు