శనివారం తెల్లవారుజామున ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పొగమంచు కప్పి, అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సున్నాకి వెళ్లిపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. ఇక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడుతుండగా ట్రాఫిక్ నత్త నడకన కదులుతున్నట్లు కనపడుతోంది. కాగా ఓ యువకుడు చలికి వణికిపోతున్న కుక్క పిల్లలకి చలిమంట వేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చలి తీవ్రత దృష్ట్యా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అంతటా 1,200 పైగా నైట్ షెల్టర్‌లు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన చలి పరిస్థితుల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 1,240 నైట్ షెల్టర్లు, తాత్కాలిక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కఠినమైన వాతావరణంలో ప్రజలు వెచ్చగా ఉండేందుకు అవసరమైన అన్ని వనరులను షెల్టర్‌లు కలిగి ఉంటాయి. అవసరమైన వారికి మూడు లక్షలకు పైగా దుప్పట్లు కూడా పంపిణీ చేయబడ్డాయి.