అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం సందర్భంగా జాన్వీ కపూర్ సంప్రదాయ లంగాఓనీలో ఎంతో అందంగా కనిపించింది. నూతన సంవత్సరం 2025 సందర్భంగా, జాన్వీ కపూర్ తిరుమల ఆలయాన్ని సందర్శించి, తన గెస్ట్ హౌస్ నుండి ఫోటోలను పంచుకున్నారు.
నీలం, ఊదా రంగుల లంగా వోణి దుస్తులు ధరించి డైమండ్ నెక్లెస్ ధరించి సాధారణ సౌత్ ఇండియన్ అమ్మాయిలా కనిపించింది. ఆమె ఫోటోలకు "నూతన సంవత్సర శుభాకాంక్షలు" అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ సందర్భంగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించింది. ఈ వీడియోను ఆమె నెట్టింట షేర్ చేసింది. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.