ఈ సమయంలోనే ఎన్నికల సంఘంలో అనేక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, అక్రమాలకు పాల్పడబోయిన రాజకీయ ఉద్ధండులకు తన నిర్ణయాలతో చుక్కలు చూపించారు. ఆయన సంస్కరణలతోనే ఎన్నికల వ్యవస్థలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.
1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్‌పై పోటీ చేసి సంచలనం సృష్టించారు. ఈసీగా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆయనకు తన స్వగ్రామంలో సొంత ఇల్లు ఉంది. అయితే, తమను సంరక్షించేందుకు పిల్లలు లేకపోవడంతో శేషన్ దంపతులు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు.
ఆశ్రమంలోని తోటివారి కష్టాలను వింటూ, వారికి చేతనైన సాయం అందిస్తున్నారు. తన సర్వీసు పింఛను డబ్బుల్లో కొంత సామాజిక సేవలకు ఖర్చు చేస్తున్నారు. ఈ ఆశ్రమంలో తన తోటివారి సమక్షంలో అత్యంత నిరాడంబరంగా గత నెల 15వ తేదీన తన 85వ పుట్టినరోజును ఆయన జరుపుకున్నారు.