కరోనాతో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ హంజా కోయా మృతి

శనివారం, 6 జూన్ 2020 (12:46 IST)
Foot Ball
కరోనా వైరస్ కారణంగా భారత మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు హంజా కోయా మృతిచెందారు. కరోనా లక్షణాలతో కేరళలోని మల్లాపురంలో ఉన్న మంజేరి వైద్యకళాశాలలో మే 26 నుంచి చికిత్స పొందుతున్నారు. శ్వాస సమస్య తీవ్రమవడంతో శనివారం ఉదయం మృతి చెందారు. దీంతో కేరళలో కరోనా మృతుల సంఖ్య 15కు చేరింది.
 
వివరాల్లోకి వెళితే.. హంజా కోయా కేరళకు చెందిన వ్యక్తి. అయితే ముంబైలో స్థిరపడ్డారు. మహారాష్ట్ర తరఫున సంతోష్‌ ట్రోఫీలో ఆడారు. ముంబైలోని వివిధ ఫుట్‌బాల్‌ క్లబ్‌లకు ప్రాతినిథ్యం వహించారు. 
 
కాగా, మహారాష్ట్రలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో 61 ఏండ్ల హంజా కోయా కుటుంబంతో సహా మే 21న సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే మే 26న ఆయనలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో వారికి హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. కానీ హంజా మాత్రం కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు