అంతేగాక ప్రజాజీవితంలో అడుగుపెట్టాలనుకునే యువతులకు శైలజా టీచర్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఓపెన్ సొసైటీ ప్రైజ్‌ను సీఈయూ ప్రతి ఏటా అందజేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన 30వ గ్రాడ్యుయేషన్ ప్రదానోత్సవం సందర్భంగా కేకే శైలజ ఈ అవార్డుకు ఎన్నికైనట్లు సీఈయూ ప్రకటించింది.
అయితే.. ఈ పురస్కారం దక్కడంపై కేరళ మాజీ మంత్రి శైలజ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే.. కేకే శైలజకు మాత్రం మంత్రివర్గంలో చోటుదక్కలేదు. అయినప్పటికీ ఆమె నిరుత్సాపడలేదు.