అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినపుడు అమృతం వచ్చే ముందు ఎన్నో వచ్చాయి. వాటితో పాటు విషం కూడా వచ్చింది. ఇప్పటి పరిస్థితి కూడా అలాగే వుంటోంది. ప్రధానమంత్రి మోదీ దేశాన్ని డిజిటల్ ఇండియాలా మార్చాలని కలలు కంటున్నారు. దీనికితోడు పలు రాష్ట్రాలు కూడా అంతే వేగంతో స్పందిస్తున్నాయి. మహారాష్ట్ర సర్కారు ముంబై నగర వాసులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించింది.