ఈ రోజున చందమామ భూమికి చాలా దగ్గరగా సంచరిస్తాడట. ఇవాళ రాత్రికి చందమామకు కొంత దగ్గర్లో శనిగ్రహం, గురుగ్రహం, అంగారక గ్రహం కనిపిస్తాయి. ఇవి అర్థరాత్రి తర్వాత బాగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఎరుపు నారింజ రంగులో మార్స్ ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
తూర్పు, ఆగ్నేయ దిశలో శనిగ్రహం కనిపిస్తుంది. గురుగ్రహం అర్థరాత్రి తూర్పు వైపున కనిపిస్తుంది. రాత్రి 2 తర్వాత మార్స్ ఎక్కువ కాంతితో కనిపిస్తుంది. ఇవాళ్టి నుంచి ఇది కాంతిని పెంచుకుంటూ పోతూ... అక్టోబర్‌లో అత్యంత ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తుంది.
ఆ సమయంలో శుక్రగ్రహానికి కుడివైపున వరుసగా అంగారకుడు, గురుగ్రహం, చందమామ, శనిగ్రహం కనిపిస్తాయి. ఇవన్నీ అంతరిక్షంలో అద్భుతాలు. వీటిని మిస్సైతే మళ్లీ మళ్లీ రావు. ఇవి వచ్చినప్పుడే చూసేస్తే.. అదో మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది.