దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ స్వయంగా నరాలపై దాడి చేస్తుంది. కొత్త కేసుతో సహా అన్ని ఇన్ఫెక్షన్లు కేసులు కలుషితమైన నీటి వనరులతో ముడిపడి వుండవచ్చు. కలుషితమైన ఆహారం, నీటిలో కనిపించే క్యాంపిలోబాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా ఈ వ్యాప్తికి కారణమని చెప్తున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) నెమ్మదిగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి క్రమంగా వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో పదేళ్ల బాలుడు జీబీఎస్ వ్యాధితో చనిపోయిన విషయం తెలియడంతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో జీబీఎస్ కలకలం సృష్టిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏడు కేసులు నమోదయ్యాయి.
డయేరియా, పొత్తికడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు.