సాధారణంగా గ్రామాల్లో ఏదైనా తప్పు చేస్తే.. ఆ గ్రామ పంచాయతీలు శిక్ష ఇవ్వడం చేస్తుంటాయి. కానీ ఆ గ్రామంలో ఎవరైనా తాగిన మత్తులో పట్టుబడితే.. మటన్ కూరతో గ్రామానికే విందు ఇవ్వాలనే వింత శిక్షను విధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన గుజరాత్, పనస్కంధా జిల్లాలోని అమిర్ఖాత్ తాలుకాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
ఇందులో భాగంగా మద్యం తాగి పట్టుబడితే రెండు వేల రూపాయల జరిమానా చెల్లించాలని, తప్ప తాగి వాగ్వివాదానికి దిగితే ఐదు వేల రూపాయల జరిమానా కట్టాలని.. ఇంకా ఆ గ్రామ ప్రజలందరికీ మటన్ గ్రేవీతో విందు ఇవ్వాలని శిక్ష ఖరారు చేశారు. దీంతో గ్రామంలో తాగుబోతుల సంఖ్య తగ్గింది. ఈ శిక్ష అమలు చేసిన ప్రారంభంలో నలుగురు పట్టుబడ్డారు.