బులంద్‌షహర్‌కు చెందిన భార్యాభర్తలు గత ఎనిమిదేళ్లుగా ఘజియాబాద్ నగరంలో నివాసముంటున్నారు. భర్త క్యాబ్ ఆపరేటరుగా పని చేస్తున్నాడు. అయితే, వివాహమైనప్పటికీ గత పదేళ్లుగా భార్యకు దూరంగా భర్త ఉంటున్నారు. దీంతో 30 యేళ్ల ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. పైగా, పిల్లలు లేకపోవడంతో ఇరుగుపొరుగువారితో పాటు... బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తీవ్ర ఇబ్బందిపడింది.
భర్త వైఖరితో విసుగుచెందిన ఆ మహిళ... వంటగదిలోని కత్తి తీసుకొచ్చి బాత్ రూంకు వెళ్లి వచ్చిన భర్త పురుషంగాన్ని కోసింది. తీవ్ర రక్తస్రావమైన అతన్ని ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు బాధితుడికి శస్త్రచికిత్స చేయగా, బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.