తనతో గడపాలంటూ టెక్కీని కంపెనీ బాస్ ఒత్తిడి... 43 మంది ఉద్యోగులు కూడా...

మంగళవారం, 14 ఆగస్టు 2018 (12:41 IST)
తనతో గడపాలంటూ ఓ మహిళా టెక్కీకి కంపెనీ బాస్‌తో పాటు ఏకంగా 43 మంది సాటి ఉద్యోగులు లైంగికంగా వేధించారు. ఈ వేధింపులు ఒక్కరోజు కాదు... ఏకంగా 10 నెలల పాటు వేధించారు. ఈ వేధింపులపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు నోయిడా పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
 
ఘజియాబాద్‌కు చెందిన 20 ఏళ్ల యువతి నోయిడాలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనికి చేరింది. ఈ క్రమంలో 2017 నవంబర్ నుంచి ఆమెను తోటి ఉద్యోగులు లైంగికంగా వేధించసాగారు. వీరితో పాటు ఆ కంపెనీ బాస్ కూడా ఉద్యోగినిని తనతో గడపాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. మరికొందరైతే వాట్సప్‌లో అసభ్యకరమైన ఫోటోలు కూడా పంపిస్తూ వేధించసాగారు. 
 
దీంతో ఐటీ కంపెనీలోని దారుణాలపై యూపీ మహిళా కమిషన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ల దృష్టికి లిఖితపూర్వకంగా తెచ్చింది. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరకు నోయిడా పోలీసులను బాధితురాలి ఆశ్రయించింది. 
 
43 మంది ఉద్యోగుల్లో బాధితురాలికి 21 మంది పేర్లు తెలియడంతో ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు వారి పేర్లు నమోదు చేశారు. మిగతా 22 మంది పేర్లను గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు