ఆడ తోడు లేక మగ జిరాఫీ మృతి..ఎక్కడ(వీడియో)

సోమవారం, 10 జులై 2017 (18:49 IST)
ఒకటి రెండు కాదు 7 సంవత్సరాల పాటు ఒంటరిగానే గడిపింది ఆ జిరాఫీ. ఆడ తోడు లేక విలవిలలాడిపోయింది. జూ అధికారులు ఎప్పటికైనా ఆడతోడు తీసుకొస్తారని వేచి చూసింది. అయితే ఆడ జిరాఫీ రాకపోవడంతో ప్రాణాలొదిలింది. ఇదంతా వింతగానే ఉన్నా.. ఇది నిజం. తిరుపతి జూ పార్కులో ఆడతోడు లేక ఒక మగ జిరాఫి అనారోగ్యంతో మృతి చెందింది. 
 
12 సంవత్సరాల వయస్సున్న జిరాఫీని 2010లో తిరుపతి జూ పార్కుకు తీసుకొచ్చారు. కలకత్తా నుంచి తిరుపతి జూ పార్కుకు తీసుకొచ్చారు. అయితే సహజంగా ఆడకి మగతోడు, మగకు ఆడతోడు ఉండాల్సిందే. కానీ ప్రస్తుతం ఆ తోడు కాస్త 7 సంవత్సరాల పాటు దొరకకపోవడంతో అనారోగ్యంతో జిరాఫి మృతి చెందిందని జూ సిబ్బంది చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి