కర్ణాటకలోని చిక్‌మగళూరు జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.
చిక్‌మగళూరు సమీపంలోని గ్రామానికి చెందిన విద్య సోదరుడి భార్య చనిపోయింది. అతడికి 15 ఏళ్ల బాలిక ఉన్నది. తల్లిలేని అమ్మాయిని నేనే అమ్మలా సాదుకుంటానని తన ఇంటికి తీసుకెళ్లింది.
డబ్బులకు కక్కుర్తి పడ్డ ఆమె.. కోడలిని ఆమెకు తెలియకుండనే వ్యభిచార కూపంలోకి నెట్టిందని పోలీసుల విచారణ బయటపడింది. అత్యాచారం చేసిన ప్రతి వ్యక్తి దగ్గర ఆమె డబ్బులు తీసుకోనే వారిని బాలిక దగ్గరకు పంపేదని తేలింది. ఇలా ఐదు నెలల పాటు బాలికకు కామాంధులు నరకం చూపించారని చిక్‌మగళూరు జిల్లా ఎస్పీ హకే అక్షయ్ మచింద్ర తెలిపారు.
బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ ఆమెపై 17 మంది అత్యాచారం చేసినట్లు వెల్లడైందని వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన బాలిక అత్త విద్యతోపాటు 8 మందిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.