గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 40 సీట్లకుగాను భారతీయ జనతా పార్టీ 20 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఒక్క సీటు దూరంలోకి వచ్చి ఆగిపోయింది. అయితే, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. ఆయన బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ బలం 21కు పెరిగింది. ఫలితంగా గోవాలో వరుసగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుంది.
మిగిలిన సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 12, ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు చెరో రెండో సీట్లను గెలుచుకున్నాయి. అయితే, బిచోలిమ్ స్థానంలో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ షెత్వే గెలిచిన వెంటనే బీజేపీకి మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. ఫలితంగా గోవాలో బీజేపీ ప్రభుత్వం మరోమారు రెండోసారి ఏర్పాటుకానుంది.