సోనాలీ ఫోగట్ శరీరంపై గాయాలు.. ఇద్దరి అరెస్టు

శుక్రవారం, 26 ఆగస్టు 2022 (09:15 IST)
భారతీయ జనతా పార్టీ మహిళా నేత, నటి సోనాలి ఫోగట్ (43)ది సహజ మరణం కాదని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో సోనాలి హత్య కేసులో ఆమె ఇద్దరు సహాయకులను గోవా పోలీసులు అరెస్టు చేశారు. సోనాలీ శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలడంతో ఆమె ఇద్దరు సహాకులైన సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 
 
సోనాలి హత్యపై ఆమె సోదరుడు రింకు ఢాకా బుధవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వీరిద్దరి పేర్లను పేర్కొన్నాడు. దీంతో అనుమానాస్పద నిందితులుగా భావించి వారిద్దరిన గోవా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
కాగా, ఈ నెల 22వ తేదీన సోనాలి గోవాకు వచ్చిన సమయంలో వీరిద్దరు ఆమెతోనే ఉన్నారు. ఆ తర్వాత రోజు ఉదయం అపస్మారకస్థితిలో పడివున్న సోనాలీని గుర్తించి ఉత్తర గోవా జిల్లాలోని సెంయింట్ ఆంథోనీ ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. 
 
అయితే, ఆమె గుండెపోటు కారణంగా మరణించివుంటుందని తొలుత వైద్యులు భావించారు. కానీ, మృతదేహానికి జరిపిన అటాప్సీ పరీక్షలో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలింది. దీంతో సోనాది ఫోగట్‌ది సహజమరణం కాదని హత్యేనని వైద్యులు తేల్చారు. 
 
దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 42 యేళ్ళ సోనాలీ భర్త గత 2016లో చనిపోగా, ఆమెకు 15 యేళ్ళ కుమార్తె ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు