సినీఫక్కిలో దొంగతనం.. గోల్డ్ షాపు తాళాలు పగలకొట్టకుండా..?
శనివారం, 25 మార్చి 2023 (15:16 IST)
సినీఫక్కిలో దొంగతనం తిరువూరు పట్టణంలోని ప్రధాన మార్గంలో ఉన్న గోకుల్ జ్యువెలర్స్ దుకాణంలో జరిగింది. ఉదయం అంతా రెక్కీ చేశారు. రాత్రికి అందరు వెళ్లిపోయాక వచ్చారు. కానీ దొంగతనం చేయాలనుకున్న గోల్డ్ షాపు తాళాలు పగలకొట్టకుండా.. పక్కనే వున్న టైలర్ షాపు తాళాలు పగుల కొట్టారు.
లోపలికి వెళ్లి గోడకు కన్నం వేశారు. కానీ అక్కడే ట్విస్ట్. ఆ రంధ్రం ద్వారా పక్కనే ఆనుకుని ఉన్న గోల్డ్‌షాపులోకి ఎంటర్ అయ్యారు. ఇద్దరు వ్యక్తులు గోడకు కన్నం వేసి గోల్డ్‌షాపులో చొరబడి.. చోరీ చేసినట్లు గుర్తించారు.
ఈ ఘటనపై షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
ప్రాథమికంగా ఎనిమిది కిలోల వెండి, 200 గ్రాములు బంగారం ఆభరణాలను అపహరించినట్లు యజమాని వెంకటాద్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.