నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని, స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు కరోనా లేదని నిరూపించే కొవిడ్-19 సర్టిఫికెట్ ను తప్పనిసరిగా సమర్పించాల్సి వుంటుందని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ల్యాబుల్లో మాత్రమే భక్తులు పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుందని అన్నారు.
యాత్ర నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన, ఆపై దర్శనాలకు అనుమతిస్తామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తులందరినీ స్క్రీనింగ్ చేస్తామని, సన్నిధానం, నీలక్కల్, పంబ ప్రాంతాల్లోని హాస్పిటల్స్ లో మరిన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తామని తెలిపారు. పంబ, నీలక్కల్ మధ్య తిరిగే బస్సుల్లోనూ భౌతికదూరాన్ని తప్పనిసరి చేస్తామని తెలిపారు.