దేశంలో కొన్ని వింత వివాహాలు జరుగుతుంటాయి. వీటిని సంప్రదాయం పేరిట కొనసాగిస్తున్నారు. తాజాగా వరుడి సోదరిని వధువు పెళ్లి చేసుకునే సంప్రదాయం.. గుజరాత్లోని కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి. గుజరాత్లోని ఒక ప్రాంతంలో పెళ్లి సమయంలో వరుడు లేకుండానే పెళ్లి జరిపిస్తారు.. అయితే, ఇక్కడ వరుడికి బదులుగా అతని సోదరి ముందుగా ఆమెను వివాహం చేసుకుంటుంది. ఆ తర్వాత తన సోదరుడి కోసం భార్యను తీసుకువస్తుంది.
వరుడి పెళ్లికాని సోదరి లేదా కుటుంబంలోని పెళ్లికాని స్త్రీ ఈ వివాహాన్ని నిర్వహిస్తుంది.. ఆమె తన అన్న జీవితానికి తొలి అడుగు వేస్తుంది. ముందుగా ఆమె తన సోదరుడికి బదులుగా వధువును వివాహం చేసుకుంటుంది. వరుడు చేయాల్సిన కల్యాణ క్రతువు మంగళసూత్రం కట్టడం, ఏడడుగులు వేయటం అన్ని అతని సోదరి చేస్తుంది.