గుజరాత్‌లో తొలి దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం - రేపు పోలింగ్

బుధవారం, 30 నవంబరు 2022 (08:22 IST)
గుజరాత్ రాష్ట్ర శాసనసభకు రెండు దేశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రక్రియలోభాగంగా తొలి దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం తొలి దశ పోలింగ్ జరుగనుంది. 19 జిల్లాల్లో 89 అసెంబ్లీ స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో మొత్తం 788 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ స్థానాలన్నింటిలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. 89 స్థానాల్లో 69 మంది మహిళలు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. 
 
మంగళవారం సాయంత్రంతో తొలి ఎన్నికల ప్రచారం ముగియగా, ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాలకు చెందిన 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి. పోటీలో ఉన్నవారిలో 719 మంది పురుషులు కాగా, 69 మంది మహిళలు ఉన్నారు. 
 
మొత్తం 89 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ తలపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాల్లో పోటీ చేస్తుంది. వీటితో పాటు బీఎస్పీ, ఎంఐఎం, వామపక్ష పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. అయితే, ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్యే నెలకొనివుంది. 
 
గుజరాత్ ప్రధాని సొంత రాష్ట్రం కావడంతో భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోడీతో పాటు కేంద్రం హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ మాత్రం కేవలం 2 రోజులు మాత్రమే ప్రచారం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు