ఆ తర్వాత అనంతబాబు బెయిల్ పిటిషన్‌లపై కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు నోటీసులు జారీచేసింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలావుంటే, ఈ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేయగా, ఈ పిటిషన్ విచారణ సమయంలో తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సుబ్రహ్మణ్యం తండ్రి కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.