తనతో గడిపిన వీడియోను లీక్ చేసిన ప్రియుడు.. ప్రియురాలు సూసైడ్

బుధవారం, 11 మార్చి 2020 (10:22 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ప్రియురాలిని ప్రియుడు మోసం చేశాడు. ప్రియురాలితో ఏకాంతంగా గడిపిన వీడియోను సోషల్ మీడియాలో ప్రియుడు లీక్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు .. ప్రియుడు చేసిన మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని ఛాహరానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను ప్రేమించాడు. ప్రేయసీప్రియులిద్దరూ పరస్పర అంగీకారంతో ఏకాంతంగా గడిపారు. 
 
శారీరకంగా కలిసివున్న దృశ్యాన్ని కూడా వారిద్దరూ వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత ప్రియురాలు తనతో గడిపిన అశ్లీల వీడియోను తన ముగ్గురు స్నేహితులకు ప్రియుడు షేర్ చేశాడు. అంతే ఆ ముగ్గురు స్నేహితులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయం ప్రియురాలి దృష్టికి వెళ్లింది. ఆమె తీవ్ర ఆవేదన చెంది... డిప్రెషన్‌లోకి వెళ్లింది. 
 
తన బాయ్ ఫ్రెండ్ చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక పోయిన 16 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేర తాము ఐపీసీ సెక్షన్లు, పోస్కో, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు