ఆయన ఇంకా ఎంతమందిని కలిశారో తెలియడం లేదు. వారందరినీ వెతికి క్వారంటైన్‌లో ఉంచడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వ్యవహారంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఈ ఉదయం సీఎంతోనూ, ఆరోగ్య, హోంశాఖ మంత్రులతోనూ ఎమ్మెల్యే జరిపిన సమావేశం వీడియోను అధికారులు పరిశీలించగా అందులో పాల్గొన్నవారంతా సామాజిక దూరాన్ని పాటించినట్టు తెలిసింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.