వణికిపోతున్న బ్యాంకు సిబ్బంది.. చెక్కులను కూడా ఇస్త్రీ చేస్తున్న ఉద్యోగి!

ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (16:20 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ మహమ్మారిబారినపడకుండా ఉండేందుకు అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వైరస్ కేవలం నోటి తుంపర్ల ద్వారానే కాకుండా కరోనా సోకిన వ్యక్తి పట్టుకున్న వస్తువును తాకినాకూడా ఈ వైరస్ సోకుతుందని తేలింది. దీంతో ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా, బ్యాంకుల్లో పని చేసే సిబ్బంది అయితే మరింతగా భయపడుతున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందడమే వారి భయానికి కారణంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ క్రమంలో తాజాగా గుజరాత్‌కు చెందిన ఓ బ్యాంక్ అధికారి.. తనకు కరోనా సోకకూడదని ఏకంగా చెక్కులను ఇస్త్రీలు చేసేస్తూ కస్టమర్లను ఆశ్చర్యంలో ముంచెత్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.
 
సదరు అధికారి.. కస్టమర్ తెచ్చిన చెక్కును పట్టకారాతో అందుకున్నారు. ఆ తర్వాత దాన్ని టేబుల్‌పై ఉంచి ఇస్త్రీ చేశారు. చేతులకు గౌవ్స్ ధరించి ఆయన ఇవ్వన్నీ చేశారు. కాగా.. ఈ వీడియోపై స్పందించిన ఆనంద్ మహింద్రా.. బ్యాంకు అధికారి సృజనాత్మకతను మెచ్చుకుని తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

In my #whatsappwonderbox I have no idea if the cashier’s technique is effective but you have to give him credit for his creativity!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు