గోమాతపై కామాంధుడు దాడి.. చెట్టుకు కట్టేశాడు.. అంతా సీసీటీవీలో...?

శుక్రవారం, 6 నవంబరు 2020 (10:46 IST)
గోమాతను దేవతగా పూజించే పుణ్యభూమి మన భారత దేశం. కన్నతల్లిలా చూసుకోవాల్సిన ఆవుపై కామంతో ఒళ్లు మరిచిపోయిన ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. చెట్టుకు కట్టేసి ఉన్న ఆవుపై ఈ చర్యకు ఒడిగట్టాడు. ఈ దుర్ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. చెట్టుకు కట్టేసి ఉన్న ఆవుపై ఆ కామాంధుడు లైంగికదాడికి పాల్పడుతున్న సమయంలో ఈ ఘటనంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని దేవభూమిగా పిలిచే ద్వారకా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ద్వారకా పాత మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో కట్టేసి ఉన్న ఆవుపై ఒళ్లు మరిచిపోయిన భరత్ అశ్వర్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆవు అటూ ఇటూ కదులుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. ఆ కామాంధుడికి కనికరం కలగలేదు. ఇది అక్కడే ఉన్న అతుల్ దేవ్ అనే సామాజిక కార్యకర్త చూసి అటువైపుగా పరిగెత్తుతూ రావడంతో.. అశ్వర్ అక్కడ్నుంచి పారిపోయాడు. సీసీ టీవీలో రికార్డైన ఈ వీడియో ద్వారా పోలీసులు అశ్వర్‌ను గుర్తించారు. అతడు ఒక రిక్షా డ్రైవర్ అని.. అతడు తనకు బాగా తెలుసునని అతుల్ దేవ్ తెలిపాడు.
 
ఏదేమైనా నిందితుడు చేసింది తప్పని.. భారతీయ శిక్షా స్మృతి లోని 377 సెక్షన్ ప్రకారం.. జంతువులపై క్రూరత్వంతో వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు