చైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం..?

గురువారం, 5 నవంబరు 2020 (20:03 IST)
సోషల్ మీడియా సమంత అక్కినేని యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. వివాహానికి ముందు.. వివాహానికి తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తూ ఫుల్ బిజీగా ఉంది సమంత. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, బిజినెస్.. ఇలా పలు రంగాల్లో రాణిస్తోంది. ఇటీవల "బిగ్‌బాస్-4'' హోస్ట్‌గా కూడా మెప్పించింది. తన కెరీర్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమంత సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. 
 
రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తుంటుంది. అంతేకాదు, నెటిజన్ల కామెంట్స్‌కు ఫన్నీగా సమాధానాలిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌కు సమంత తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. ''ఫీలింగ్ గుడ్'' అంటూ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది. 
 
దీనికి స్పందించిన ఓ నెటిజన్.. "చైతన్యకి విడాకులు ఇచ్చేయ్.. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం'' అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు సమంత స్పందిస్తూ.. "కష్టం.. ఒక పని చెయ్.. చైని అడుగు" అని రిప్లై ఇచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు