భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిన ఫర్జానా 10 రోజుల కిందట తిరిగి అత్తవారింటికి వచ్చింది. మళ్లీ బుధవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవపడగా, ఫారూఖ్ ఫర్జానాపై చేయిచేసుకున్నాడు. దీంతో ఫర్జానా గురువారం సాయంత్రం ఫారూఖ్ తలపై సుత్తితో కొట్టి హతమార్చింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని ఫర్జానాను అరెస్టు చేశారు.