అయితే, గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. ప్రతి రోజూ జిమ్‌కు వచ్చి వ్యాయామం చేయసాగాడు. ఈ క్రమంలో గత ఆదివారం కూడా అతను జిమ్‌కు వెళ్లి ఇంటికొచ్చాడు. ఓవైపు జ్వరంతో బాధపడుతూనే ఆఫీసుకు వెళ్లాడు.
ఆదిల్ మరణవార్త విని ఆయన భార్యా పిల్లలు షాక్‌కు గురయ్యారు. తన భర్త వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని ఆదిల్ భార్య చెప్పారు. మామూలు జ్వరమేనని, తనకేమీ కాదని భర్త తేలిగ్గా తీసుకున్నాడని, ఇంతలోనే ఇలా జరుగుతుందని అనుకోలేదని వాపోయారు.