దేశంలో మరో 20 ఏళ్లకి సగం పట్టణాలే

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (09:04 IST)
దేశంలో మరో 20 ఏళ్లకి సగభాగం సగం పట్టణాలే వుంటాయని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో ప్లానింగు సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ప్రైవేటు సెక్టార్‌ అవసరం ఎక్కువగా ఉందని నివేదికలో పొందుపరిచారు.

రెండు దశాబ్దాల్లో దేశం పూర్తిగా పట్టణీకరణ అవుతున్న నేపథ్యంలో దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడంతోపాటు పట్టణ ప్రణాళికలో ఉన్న లోపాలను సరిచేయాల్సి ఉందని నివేదికలో పొందుపరిచారు.

2027 నాటికి ప్రపంచ జనాభాలో 11 శాతం దేశంలోనే ఉంటుందని, చైనా జనాభాను మించి పోతుందని వివరించారు. ప్రస్తుతం ప్రణాళిక లేకుండా పెరుగుతున్న పట్టణాల వల్ల ఒత్తిడి పెరిగిపోతోందని, కోవిడ్‌-19 పట్టణ ప్రణాళిక అవసరాలను మరోసారి గుర్తు చేసిందని పేర్కొన్నారు.
 
వచ్చే ఐదేళ్లలో 500 నగరాలను ఆరోగ్య నగరాలుగా మార్చాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో భూమిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. దీనికోసం ప్రణాళికా విభాగాల్లో అదనపు సిబ్బందిని నియమించుకోవాలి. ప్రస్తుతం టౌన్‌ప్లానింగుకు అవసరమైన నిపుణుల కొరత తీవ్రంగా ఉంది.

పట్టణ ప్రణాళికా విభాగాలను రీ ఇంజనీరింగ్‌ చేయాల్సి ఉంది. అధికారుల విధుల్లో స్పష్టమైన పని విభజన చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న టౌన్‌ అండ్‌కంట్రీ ప్లానుల్లో నిబనంధలను పూర్తిస్థాయిలో సవరించాల్సి ఉంది. దీన్ని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు రాష్ట్రస్థాయిలో అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు