హంటా వైరస్‌తో భయం అక్కర్లేదు.. ఎలుకల్ని అలా తింటేనే?

బుధవారం, 25 మార్చి 2020 (12:26 IST)
కరోనా వైరస్‌తో ఇప్పటికే నానా తంటాలు పడుతుంటే... ప్రస్తుతం హంటా వైరస్‌తో ఒక వ్యక్తి చైనాలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చైనాలో మళ్లీ కొత్త వైరస్ వచ్చిందా అమ్మో అంటూ జడుసుకున్నారు. దీని గురించి అనవసరంగా హడావుడి చేస్తున్నారు. లేని హడావుడి చేస్తూ ప్రజలను మరింత కంగారు పెడుతున్నారు. కానీ దీని గురించి అంత ఆందోళన అవసరం లేదని.. దాని వలన ఎవరూ మరణించే అవకాశం లేదని వైద్యులు చెప్తున్నారు. 
 
ప్రస్తుతం దీనికి మందు అందుబాటులో ఉందని 2016లోనే దీనికి మంది కనిపెట్టారని చెప్తున్నారు. ఎలుకల్లో ఉండే ఈ వైరస్… ఎలుకలు మనుషుల్ని కుట్టినా, ఎలుకలు తిని వదిలేసిన ఆహారాన్ని మనుషులు తిన్నా, ఎలుకల లాలాజలం తిన్నా, ఎలుకల వ్యర్థాల్ని తిన్నా తద్వారా వైరస్ వస్తుంది. ఇది అంటువ్యాధి కాదు. మన దేశంలో చాలా ఎలుకలు ఉన్నా వాటిని కక్కుర్తి పడి తినే పరిస్థితి ఉండదు. ఎవరో ఒకరిద్దరు తిన్నా వాటిని వండి తినడమే గాని చైనా మాదిరిగా పచ్చిగా తినే ఛాన్సుండదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు