నిజానికి తొలుత సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌దవా పేరును నూతన సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రకటించింది. కానీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోతి సింగ్ సిద్ధూ ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి మార్చుకుని చన్నీ పేరును ప్రకటించింది.
నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్టానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరంజిత్ సింగ్ చన్నీ వైపుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం.