ఒక్క రోజు కలెక్టర్ : ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి

ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (17:43 IST)
గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ చిన్నారి ఒక్క రోజు కలెక్టర్ అయ్యారు. ప్రాణాంతక వ్యాధితో బాధపుడుతూ చావుకు దగ్గరైన ఆ చిన్నారి కోరికను అమ్మదాబాద్ జిల్లా కలెక్టర్ నెరవేర్చారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా అసోడియా 7వ తరగతి చదువుతోంది. కొంతకాలంగా ఆమె బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడూ చావుకు దగ్గర్లో వుంది. గత నెలలో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. 
 
ఈ క్రమంలో మెరుగవుతుందనుకున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. చిన్నారి కలను 'మేక్ ఏ విష్ ఫౌండేషన్' ప్రతినిధులు తెలుసుకున్నారు. చొరవతీసుకుని చిన్నారి గురించి అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సందీప్ సాంగ్లేకు వివరించారు. 
 
చిన్నారి కలను సాకారం చేయాలని కోరారు. దీంతో చిన్నారిని ఒక్కరోజు కలెక్టర్‌ చేసేందుకు ఆయన అంగీకరించారు. ఒక్కరోజు అహ్మదాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకొంది.
 
దీనిపై కలెక్టర్ సందీప్ సాంగ్లే స్పందిస్తూ, ‘ఫ్లోరా గురించి తెలిశాక, వారి తల్లిదండ్రులను సంప్రదించాం. ఒకరోజు కలెక్టర్‌ విషయమై అంగీకారం కోరాం. కానీ, శస్త్రచికిత్స తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని చెప్పి దానికి వారు విముఖత వ్యక్తం చేశారు. చివరకు ఎలాగోలా వారిని ఒప్పించి ఆమె కలను సాకారం చేశాం’ అని కలెక్టర్‌ సందీప్‌ సాంగ్లే పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా చిన్నారి పుట్టినరోజు (సెప్టెంబరు 25) వేడుకలను కూడా ముందుగానే జరిపారు. కాగా.. ఫ్లోరా చదువులో ముందుండేదని తల్లిదండ్రులు చెప్పారు. కలెక్టర్‌ అవ్వాలనుకున్న తన కలను నెరవేర్చినందుకు సంతోషిస్తూ.. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

 

Gujarat: Flora Asodia, an 11-year-old girl suffering from brain tumor, was made collector of Ahmedabad for a day on Saturday

"She underwent surgery in August... We received a message from Make-A-Wish Foundation that Flora wishes to become collector," said Collector Sandip Sangle pic.twitter.com/bmA4q3s8c5

— ANI (@ANI) September 18, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు