హరిద్వార్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... హరిద్వార్ సమీపంలోని అవడిపుర్హాల్ గ్రామంలో జరుగుతున్న వివాహ మండపంలో ఒక యువతి బాంబులా దూసుకొచ్చింది. వరుడిని పట్టుకుని చెంపలు వాయించింది. చుట్టుపక్కలవారు ఆమెను పక్కకు తోసి విషయం అడుగగా, వరుడికి తాను మాజీ గర్ల్ ఫ్రెండ్‌నని, ఎన్నో సంవత్సరాల నుంచి తామిద్దరికీ సంబంధం ఉందని చెప్పింది. ఈ పెళ్లి చేసుకుంటే అరెస్ట్ చేయిస్తానని హెచ్చరించింది.
దీంతో పెళ్లి కుమార్తె అడ్డం తిరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని పెళ్లి చేసుకునేది లేదని వధువు భీష్మించుకు కూర్చుంది. ఆమె బాధను చూసిన బంధువులు, వరుడి తరపువారిని వెళ్లిపోవాలని కోరారు. మాటా మాటా పెరుగగా, పోలీసు స్టేషనుకు వెళ్లాలని అనుకున్న ఇరు వర్గాలు, చివరికి పంచాయితీని ఆశ్రయించాయి.