జ్వరం బారినపడిన రెండు రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన చిన్నారి మరణించినట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ప్లేట్లెట్స్ కౌంట్ భారీగా తగ్గిపోయి.. తొమ్మిది నెలల పసికందు చనిపోయింది. అయితే ఆ శిశువు డెంగ్యూతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంత మంది పిల్లలు మరణించినప్పటికీ వైద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు.