సోనియా కుటుంబసభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఆదేశించింది. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం హయాలో గాంధీ కుటుంబం సమీకరించిన ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.
2005లో హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా అసోసియేటెడ్ జర్నల్స్‌కు 23 ఏళ్ల నాటి రేట్ల ఆధారంగా ఈ ఫ్లాట్ ను గాంధీ కుటుంబ సభ్యులకు అప్పగించారని పేర్కొంటూ ఆ ఫ్లాట్ ను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది.
గాంధీ కుటుంబం నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లపై విచారణకు ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయితే బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా పేర్కొన్నారు.