ఉత్తరాదిన భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఇప్పటికే అస్సోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని లక్నోలోని వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 26 నుంచి 28 మధ్య ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బీహార్‌లలో, జూలై 27-29 మధ్య పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది.