విద్యావంతురాలైన మహిళ పురుషుడికి దగ్గరైతే అది బలవంత చేసినట్టు ఎలా అవుతుంది?

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (19:37 IST)
విద్యావంతురాలైన ఓ మహిళ పురుషుడికి దగ్గరైతే అది బలవంతం చేసినట్టు ఎలా అవుతుందని హర్యానా పంజాబ్ హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. పైగా, తనకు బలవంతగా అబార్షన్ చేయించాడన్న పిటిషనర్ వాదనలను కూడా కోర్టు తోసిపుచ్చింది. అబార్షన్ మందు ఇచ్చాడంటూ మహిల స్వయంగా కోర్టుకు సమర్పించిన ఔషధం తాలూకు సాక్ష్యాలు న్యాయపరీక్షకు నిలవలేదని స్పష్టం చేసింది. పైగా, ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. 
 
కొంతకాలంగా ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతున్న ఓ మహిళ ఇటీవల అతడిపై పంజాబ్, హర్యానా హైకోర్టులో కేసు వేసింది. పెళ్లిపేరిట తనను లొంగదీసుకున్నాడని ఆరోపించింది. అతడికి మరో మహిళతో పెళ్లయ్యాక కూడా తనను వివాహం చేసుకుంటానంటూ మోసగించాడని పిటిషన్ దాఖలు చేశారు. 
 
అయితే.. కోర్టు మాత్రం ఆమె వాదనలను తిరస్కరించింది. 2012 నుంచి ఆరేళ్ల పాటు పిటిషనర్ ఆ వ్యక్తితో సంబంధం కొనసాగించిన విషయాన్ని ప్రస్తావించింది. ఇన్నేళ్ల పాటు సాగిన బంధాన్ని బలవంతంగా చేసినట్టు పరిగణించలేమని స్పష్టం చేసింది. విద్యావంతురాలైన మహిళ పెళ్లయిన పురుషుడికి దగ్గరైతే దాన్ని బలవంతం చేసినట్టు ఎలా భావించగలమని ప్రశ్నించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు