జేడీఎస్ నాయకులు హెచ్‌డీ కుమారస్వామి ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సన్నిహితులు తెలిపారు. అలసట, జ్వరంతో బాధపడిన ఆయన ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. బెంగళూరులోని జయనగర్.. అపోలో స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
అనంతరం ఇలా అనారోగ్యం బారిన పడటం వల్ల కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్జరీకి, ఇప్పటి ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు నిర్ధారించారు.