కింద మంట బెట్టినట్టుగా సలసల మరిగిపోతున్న వాటర్ ట్యాంకులో నీళ్లు.. (Video)

ఠాగూర్

ఆదివారం, 2 జూన్ 2024 (11:49 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఢిల్లీలో ఓ భవనంపై ఉన్న వాటర్ ట్యాంకులోని నీళ్లు సలసల మరిగిపోతున్నట్టుగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం ఈ వీడియో నిజం కాదని కామెంట్స్ చేస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ భవనంపై ఉన్న వాటర్ ట్యాంకులో నీళ్ళు కింద మంటబెట్టినట్టుగా కుతకుత ఉడిపోయాయి. ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత 52 డిగ్రీలకు చేరుకోవడంతో ట్యాంకులోని నీళ్లు ఇలా మరిగిపోతున్నాయంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో విషయంలో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. 
 
ఒకరు.. అమ్మో ఈ వేడికి ఢిల్లీ జన ఎలా బతుకుతున్నారో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మరికొందరు మాత్రం ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేస్తున్నారు. నీళ్లు బాయిలింగ్‌ పాయింట్ 100 డిగ్రీలని, 52 డిగ్రీల వద్ద నీళ్లు మరగడం అసాధ్యమని కొందరు కొట్టిపడేస్తున్నారు. అంతేకాదు.. ఢిల్లీలో 52 డిగ్రీల ఉష్ణోగ్రత అసలు నమోదు కాలేదని మరికొందరు చెబుతున్నారు. కాగా, రెండు రోజుల క్రితం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఇక్కడ నమోదైన విషయం తెల్సిందే. 

 

Heat in Delhi is making water boil.???? pic.twitter.com/IUErkhHjW8

— Tathvam-asi (@ssaratht) June 1, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు